నిర్మల్ (విజయక్రాంతి): సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ శనివారం నిర్మల్ జిల్లాలో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వివిధ విద్యాసంస్థలను సందర్శించి బందుకు సహకరించాలని వారు విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వెంకటేష్ దిగంబర్ రాజు తదితరులు పాల్గొన్నారు