19-04-2025 06:18:51 PM
పల్లా దేవేందర్ రెడ్డి...
వేములపల్లి (విజయక్రాంతి): ఈనెల 21, 22 తారీకులలో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి(State Working President Palla Devender Reddy) పిలుపునిచ్చారు. శనివారం వేములపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో సంక్షేమ బోర్డు కార్డులను భవన నిర్మాణ కార్మికులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని 1996లో అమలు చేయడం జరిగిందన్నారు. ఈనెల 21 22 తారీకులలో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ దగ్గర జరగబోయే తెలంగాణ రాష్ట్ర మహాసభలను భవన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదయ్య, కత్తుల బిక్షం, శ్రీరామ్ రెడ్డి, రహీం, రామానుజ, రెడ్డి, శ్రీను, ఎల్ ప్రసాద్ రెడ్డి, విజయ, నాగరాజు, కళమ్మ, హేమలత, సైదమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.