calender_icon.png 18 April, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు సమయంలో ఇబ్బంది లేకుండా చూడాలి

09-04-2025 09:04:08 PM

అదనపు కలెక్టర్ మోతిలాల్..

చెన్నూర్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కేంద్రాలకు వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. చెన్నూరులో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రాల్లో వేసవి అయినందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, నీడ తదితర వసతులను కల్పించాలని కోరారు. కొనుగోలుకు అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి కేంద్రంలో కనీసం 25 టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని, కొనుగోళ్లకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, పోరా సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకళ, డీఆర్డీవో కిషన్ తదితరులు పాల్గొన్నారు.