19-04-2025 08:39:18 PM
సూర్యాపేట: రైతులు వారి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే క్రమంలో తూకంలో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ పి రాంబాబు నిర్వాహకులకు సూచించారు. శనివారం సూర్యాపేట మండలం పిల్లలమర్రి లోని పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... తాలు లేకుండా, తేమ 17 శాతం ఉండేలా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు తెలిపారు. అనంతరం నాగారం లోని వాసవి రైస్ మిల్లు తనిఖీ చేసి, మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ పద్మ,సెంటర్ ఇంచార్జి లు నాగరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.