మున్సిపల్ కమిషనర్లతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, జనవరి 28: ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. దుబాయ్ పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన మైలార్దేవ్ పల్లిలోని తన నివాసంలో శంషాబాద్, మణికొండ నార్సింగి, బండ్లగూడ మున్సిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీళ్ల పాలకమండల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేక అధికారులతో సమన్వయంతో పనిచేయా లన్నారు. జటిలమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఉన్నత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు .
వారికి సూచించారు. ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు లేకుండా, అందరికీ అందుబాటులో ఉండి సమన్వయంతో పని చేసుకోవాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, నార్సింగి కృష్ణమోహన్ రెడ్డి, మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, శంషాబాద్ కమిషనర్ సుమన్ రావు పాల్గొన్నారు.