21-03-2025 12:39:38 AM
తాగునీరు ఇబ్బంది రానివ్వకండి
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ మార్చి 20 (విజయ క్రాంతి) : చెరువులు కుంటల భూములు అక్రమంగా గురి కాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయం లో రెవెన్యూ,ఇరిగేషన్,మిషన్ భగీరథ,వ్యవసాయ శాఖ,ఎం. పి.అర్, ఏ.పి. ఓ లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఎక్కడైనా కబ్జాలకు గురైనట్లు మీ దృష్టికి వస్తే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా ముందుకు సాగి కబ్జాల గురి కాకుండా చూడాలని ఆదేశించారు. మల్ బోయిన పల్లి లో అదనపు పంప్ సెట్ త్రాగు నీరు సరఫరాకు ఇబ్బంది లేకుండా వారం రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం పోచమ్మ గడ్డ తండా లో రైతు భిక్యా నాయక్ వరి పొలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 3 ఎకరాల్లో వరి పైరు వేసుకున్న అతని పొలం భూగర్భ జలాలు ఇంకి పోవడం తో వరి పైరు ఎండి పోయింది. జిల్లా కలెక్టర్ ఈ పొలాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ నర్సింహ రావు,ఎం.పి.డి. ఓ విజయ్ కుమార్, ఎంపిఓ సరిత, వ్యవసాయ శాఖ ఏ.డి.ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్, మిషన్ భగీరథ, విద్యుత్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.