calender_icon.png 2 January, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు వంట ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి

30-12-2024 06:54:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్న వంట సిబ్బంది విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లాలోని కుబీర్ బైంసా కల్లూరు కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులు, వంట మనుషులతో అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీచర్లు సమ్మె చేయడం వల్ల పాఠాలు జరగడం లేదని విద్యార్థులు డీఈఓ కు వివరించగా త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.