బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 24(విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దావోస్‌కు వెళ్లి తెచ్చిన పెట్టు బడులపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పం దించారు. కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని ప్రభుత్వానికి సూచి ంచారు.
హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలనే ఉద్ధేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు ఎనిమిది ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఐటీ హబ్‌లను పట్టించుకోలేదన్నారు.