24-02-2025 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
కరీంనగర్, ఫిబ్రవరి ౨౩ (విజయ క్రాంతి): కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి శాసన మండలికి పంపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పట్టబద్రులకు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ వివిధ ప్రజా సంఘాలలో పనిచేస్తున్న పట్టభద్రుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులను నియోజకవర్గ పరిధి లోని పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం నరేందర్ రెడ్డి నిరంతరం కృషి చేయడంతో పాటు నిరుద్యోగ నిర్మూలన కోసం, అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధన కోసం పూర్తిస్థాయిలో అవగాహన ఉండి ప్రభుత్వంతో మాట్లాడే చొరవ ఉన్న నాయకుడని అన్నారు. సమస్యలపై అవగాహన లేని ఎంతోమంది.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, బిజెపి ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికలప్పుడు మాత్రమే కనబడుతారని, ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతారని అలాంటి వారిని ఓడించాలని, సిపిఐ మద్దతు తో కాంగ్రెస్ అభ్యర్థి గా నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడమే లక్ష్యం గా సిపిఐ శ్రేణులతో పాటు ప్రజాసంఘాల వారంతా పట్టుదలతో పని చేయాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానికుడనైన నన్ను నమ్మి పట్టబద్రల ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా పనిచేస్తానని సమస్యల పరిష్కారించ డంలో ముందుంటానని అన్నారు.
నాపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అవి నిరాదరణ మైనవని, గత 30 సంవత్సరాలుగా లక్షలాదిమంది విద్యార్థులకు విద్యా బోధనలు అందించడంతోపాటు వారిని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత తనదని, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,
నాపై నమ్మకంతో పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల కోసం నిరుద్యోగుల కోసం మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం కలుగుతుందని, సిపిఐ,సిపిఎం పార్టీలతో పాటు ఆయా ప్రజాసంఘాలలోని పట్టభద్రులంతా తనను గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ర్ట కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, ఏ.ఐ.ఎస్.ఎస్ రాష్ర్ట అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు,కౌన్సిల్ సభ్యులు పంజాల శ్రీనివాస్,అందె చిన్న స్వామి,ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు బోనగిరి మహేందర్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్,ఉపాధ్యక్షులు,సహాయ కార్యదర్శి కనకం సాగర్, కేశబోయిన రాము, నాయకులు శ్యామ్, విన య్, స్వప్న, మానస, రజిత, లక్ష్మీ, సుజాత, మాధురి, సురేష్, కిరణ్, అజయ్, సాయి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.