24-02-2025 06:51:51 PM
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కరంలో ముందుండే విద్యావంతుడు, మైనారిటీ బీసీ సామజిక వర్గనికి చెందిన ప్రజా గొంతుకైన స్వతంత్ర అభ్యర్థి మొహమ్మద్ ముస్తాక్ అలీని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 43, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.
స్వతంత్ర అభ్యర్థి మొహమ్మద్ ముస్తాక్ అలీకి ఆప్ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ లలో ఆప్ శ్రేణులు మొహమ్మద్ ముస్తాక్ అలీ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్ధి, నిరుద్యోగ, దళిత, మైనారిటీ, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఆయనకే మద్దతు ప్రకటించాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను విస్మరించి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట వేయడం దుర్మార్గమన్నారు.