19-04-2025 01:26:18 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 18: జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మైలార్దేవ్పల్లి లోని తన నివాసంలో మైలార్దేవుపల్లి డివిజన్ నేతలతో సమావేశమాయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్ సమావేశాలను నిర్వహించాలని, దానికి సంబంధించిన షెడ్యూల్ తయారుచేయాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
అందరూ కలిసికట్టుగా ఉండి సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు.శనివారం నుంచి మైలార్దేవ్పల్లి ,శంషాబాద్, గండిపేట మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శంషాబాద్, గండిపేట్ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.