మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): రోడ్డును నాణ్యతగా వేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆది వారం హన్వాడ మండల పరిధిలోని షేక్ పల్లి నుంచి కొమిరెడ్డిపల్లి వరకు వేస్తున్న బీటీ రోడ్డును టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎక్కడ ఏలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలు తరతరాలు గుర్తుంచు కునేలా నాణ్యతగా రోడ్డు వేయాలని సూచిం చారు.
ఈ రోడ్డు నిర్మాణం కోసం షేక్‌పల్లి గ్రామ వాసులు ఏళ్ల తరబడి ఎదురు చూశా రని తెలిపారు. గతంలో రోడ్డును వయసు ఎందుకు భూమి పూజ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేస్తే చాలని, ఆరంభించిన ప్రతిధ్వని ముందుకు తీసుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రఘు తదితరులు ఉన్నారు.