25-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 24(విజయ క్రాంతి) : బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దెలా చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు సూచిం చారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి జిల్లా సంక్షేమాశాఖ అధికారి భాస్కర్, డీసీపీవో మహేష్ హాజ రయ్యారు. ఈ సందర్భంగా జిల్లా లో బాల్య వివాహాల నిర్మూలన గురించి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ జిల్లాలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా పకడ్బందీ చర్యలతో పాటు ఎటువంటి ఉపేక్ష ణ లేకుండా, మొదటి జ్యుడీషియల్ ఇంజెక్షన్ ఆర్డర్స్ జారీ చేసి, సంబం ధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచే స్తూ బాల్య వివాహాల నిర్మూలకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్ర మంలో సంబంధిత శాఖల అధికా రులు పాల్గొన్నారు.