26-03-2025 10:14:27 PM
ఆర్టీసీ డిఎం రాజేశ్వర్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అసిఫాబాద్ డిపో నుండి నడిచే బస్సుల సమయాలు, రూట్ వివరాలు తెలుసుకోవడం ఇక సులభతరం అని ప్రయాణికులు 9493282510 విచారణ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని డిపో మేనేజర్ కే.వి. రాజశేఖర్ తెలిపారు. ఈ సేవ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రయాణించే వారికి సమాచారం తక్షణమే అందుబాటులోకి రానుంది. రోజూ వందలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న అసిఫాబాద్ డిపోలో ఈ కొత్త విచారణ సౌలభ్యం ప్రవేశపెట్టడం శుభపరిణామంగా భావిస్తున్నారు. "బస్సు షెడ్యూల్‌లు, రూట్ మార్పులు లేదా ఇతర సమస్యలపై స్పష్టత కోసం ఈ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రయాణికుల సమయం, శ్రమ ఆదా చేయడమే మా లక్ష్యం అని డిపో మేనేజర్ వివరించారు.