calender_icon.png 19 March, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి

18-03-2025 06:44:45 PM

ఎస్ఐ అభినవ్...

కాటారం (విజయక్రాంతి): సిఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని కాటారం ఎస్సై అభినవ్ అన్నారు. చోరీకి గురైన, పోగొట్టుకున్న ఐదు సెల్ ఫోన్లను బాధితులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై అభినవ్ మాట్లాడుతూ.... ఎవరైనా వారి ఫోన్లు పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైన సదరు ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఫోను తిరిగి పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్లను అనుమానిత వ్యక్తులు ఇతర విలువైన వస్తువులు దొరికితే సమీప పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని అన్నారు. అంతేకానీ అలాంటి వస్తువులను తమ దగ్గర ఉండడం నేరమని ఎస్సై అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొబిషనరీ ఎస్ఐ గీత, కానిస్టేబుల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.