28-02-2025 01:46:48 AM
ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) : స్టడీ మెటీరియల్స్ ను ప్రాక్టీస్ చేయాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ సూచించారు. ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ పట్టణం లోని, ఎదిర జిల్లా పరిషత్, అప్పనపల్లి, ఉన్నత పాఠశాలలతోపాటు వివిధ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తో కలిసి ఆయన పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంచాలనే సంకల్పంతో ఉన్నారని, అందుకే తన సొంత నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తురన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దూరదృష్టితో ఆలోచించి పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందిస్తున్నారని వీటిని విద్యార్థులు ఉపయోగించి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిఎంఓ బాలు యాదవ్, నాయకులు హన్మంతు, శివశంకర్, రామాంజనేయులు, చర్ల శ్రీనివాసులు, జి.రాములు, శేఖర్, పాల్గొన్నారు.