08-04-2025 12:00:00 AM
పేదల కడుపు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. సోమవారం మండలంలోని ఊట్పల్లిలో గిరిజన లబ్ధిదారుడి ఇంట్లో సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని ఎమ్మెల్యే హరీష్‌బాబు, అదనపు కలెక్టర్ డేవిడ్ స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ పాల్గొన్నారు. కాగజ్‌నగర్, (విజయక్రాంతి)