calender_icon.png 7 April, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలి

07-04-2025 05:53:14 PM

ఎమ్మెల్సీ దండె విఠల్..

కాగజ్ నగర్ (విజయక్రాంతి): సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vittal) అన్నారు. సోమవారం మండలంలోని ఊట్పల్లి గ్రామంలో గిరిజన లబ్ధిదారుడి ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, అదనపు కలెక్టర్ డేవిడ్ తిన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందచేస్తున్న బియ్యాన్ని పక్కదోవ పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.