05-03-2025 01:15:51 AM
కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): మే 4న జరగనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నీట్ పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో శాంతికుమారి మంగళవారం సచివాలయంలో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పరీక్షల నిర్వహణ లో ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని, మౌలిక సదుపాయాలు, తగిన భద్రతా సౌకర్యాల ను ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భూ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) పురోగతిని కూడా సీఎస్ సమీక్షించారు.
ఇప్పటి వర కు అందిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించిన దరఖాస్తులకు రాయితీపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, లా అం డ్ ఆర్డర్ ఏడీజీపీ మహేశ్ భగవత్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకే షన్ డైరెక్టర్ నరేందర్ పాల్గొన్నారు.