calender_icon.png 9 January, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలను తీర్చిదిద్దండి ఇలా..

13-08-2024 12:00:00 AM

పేరెంటింగ్

చిన్నతనం నుంచే వ్యక్తిత్వ లక్షణాలు అలవాటు చేయడం వల్ల పిల్లలు చదువుతో పాటు ఇతర యా క్టివిటీస్‌లోను ముందుంటారు. అయితే పేరెంట్స్ కొందరు అశ్రద్ధ వహిస్తుంటారు. అలాంటివాళ్లు టి ప్స్ పాటిస్తే చాలు.. బెస్ట్ పేరెంట్స్ అయ్యిపోవచ్చు.  

ఎంకరేజ్ చేయండి..

కొంతమంది తల్లిదండ్రులు చిన్న చిన్న తప్పులకే కోపగించుకుంటారు. వాళ్ల తప్పులను ఎత్తిచూ పకుండా స్నేహంగా ఉంటూ నష్టాలు, లాభాలు ఎంటో వివరించి చెప్పాలి. పిల్లలతో బాండింగ్ పెంచుకుంటే ప్రతి విషయం డిస్కస్ చేయడానికి ఆసక్తి చూపుతారు. మీ పిల్లలను ఇతరులతో పోల్చకుండా.. వాళ్లకు ఏం ఇష్టమో తెలుసుకొని ఎంకరే జ్ చేస్తే స్కూలింగ్ లోనే వ్యక్తిత్వ లక్షణాలు అబ్బుతాయి. మీ పిల్లలు బాగుంటే ఇతరులు కూడా  మెచ్చుకుంటారు. 

ప్రేమించండి..

ఉరుకుల పరుగుల జీవితంలో పేరంట్స్ పిల్లల ప్రేమకు దూరంగా ఉండిపోతున్నారు. ఏమాత్రం సమయం దొరికినా పిల్లలతో కలిసిపోవాలి. వాళ్లు చేసే ప్రతి పనిని ప్రశంసించాలి. ప్రేమపూర్వకమైన వాతావారణంలో పెంచితే ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టం చూపుతారు. ఇలా చే యడం వల్ల పిల్లల బలహీనతలు క్రమక్రంగా తగ్గి.. వాళ్లలో వ్యక్తిత్వ వికాసం మరింత మెరగవుతుంది.

నెగిటివ్‌కు దూరంగా.. 

నెగిటివ్ ఆలోచనలు పిల్లల వ్యక్తిత్వంపై చెడు ప్రభావం చూపుతాయి. పేరెంట్స్ నిత్యం పిల్లలతో సానుకూల విషయాలను మాట్లాడాలి. ఒకవేళ పిల్లలు అదే పనిగా నెగిటివ్ ఆలోచనలతో సతమతమవుతున్నట్లు భావిస్తే ఆయా విషయాల గురించి మంచి చెడును వివరించాలి. పిల్లలు వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చాలనుకుంటే వారికంటూ సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చను కూడా ఇవ్వాలి. 

సోషల్ సర్వీస్‌కు దగ్గరగా

సోషల్ సర్వీస్ వైపు పిల్లలను ప్రోత్సహించాలి. దీంతో పిల్లల్లో మానవతా విలువలు పెరిగి ఉన్నతంగా పెరుగుతారు. సోషల్ సర్వీస్ అలవాటు చేయడం వల్ల ఇతర పిల్లలతో పాటు సొసైటీ పట్ల దయాగుణంతో ఉంటారు.