calender_icon.png 1 April, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో మానుకోటను విజయవంతం చేయండి

28-03-2025 01:21:15 AM

మహబూబాబాద్, మార్చి 27 (విజయ క్రాంతి): ఈ నెల 29వ తేదీ మహబూబాబాద్‌లో జరిగే గిరిజన హక్కుల సాధనకై చలో మానుకోట సభను విజయవంతం చేయాలని ఎల్‌హెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజ వాసు నాయక్ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో లకావత్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు నాయక్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ మాట్లాడుతూ లంబాడీల మాతృభాష అయిన గోర్ బోలి ను గుర్తించి రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చా లని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరికి క్యాబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయం క్రిమిలేయర్ తో రిజర్వేషన్లను జీరో చే సే కుట్రపై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ చట్టాలను 100% పకడ్బందీగా అమలు చేయాలని తండాల గ్రామపంచాయతీ గూడెంలో గ్రామపంచాయతీలను వెంటనే రెవిన్యూ గ్రామపంచాయతీలో గుర్తించాలని అన్నారు మైదాన ప్రాంత గిరిజనులు అభివృద్ధి కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఐటిడిఏ లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో కీరియా నాయక్ చందులాల్ నాయక్ వాలియా నాయక్ మంగ్యా నాయక్ లాలునాయక్ కొమ్మాలు నాయక్ శ్రీను నాయక్ విజయ నాయక్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.