13-02-2025 12:00:00 AM
సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 12: ఈ నెల 20న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఛలో హైద రాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవా రం పట్టణంలోని కామ్రేడ్ చండ్ర పుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్క రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం లో ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్య లను ఎజెండాగా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేడు ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
ఆరు గ్యారంటీలను పూర్తి స్థా యిలో అమలు చేసి, అనరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కాకుండా, నిజమైన అరులకు అభివృద్ధి పథకాలు అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబు తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఏ ఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదు లు, సహాయ కార్యదర్శి నర్సింహారావు, అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, పిడిఎస్‌యు రాష్ర్ట ఉపాధ్యక్షులు పోలేబో యిన కిరణ్, బిఓసి జిల్లా కార్యదర్శి దేసో జు మధు, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి పాల్గొన్నారు.