calender_icon.png 26 April, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీని బీఆర్‌ఎస్ అధ్యక్షుడిని చేయండి

26-04-2025 12:00:00 AM

  1. రజతోత్సవ సభలో బీసీ పాలసీ ప్రకటించాలి
  2. కేసీఆర్‌కు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బహిరంగ లేఖ 

ముషీరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చేలా ఆ పార్టీ వరంగల్ రజతోత్సవ సభలో ప్రకటించాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ణు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సభలో బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలని ఆయన కోరు తూ శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కేసీఆర్‌కు బహిరంగ లేఖను విడుదల చేశారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్లు బీఆర్‌ఎస్ జెండాలు మోసింది ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని కానీ పదవులు అనుభవించింది మాత్రం ఆ నలుగురేనని విమర్శించారు. గత 16 నెలల కాలంలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అలాంటి వారి సభ కు బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజలు ఎందుకు వెళ్లాలని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ పార్టీనా, ప్రాంతీయ పార్టీనా కేసీఆర్ స్పష్టం చేయాలని డి మాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా అవమానించింది బీఆర్‌ఎస్ పార్టీనేనని, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, టైగర్ నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్‌లను తీవ్రంగా అవమానించి పార్టీ నుంచి బహిష్క రించిన చరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకు జరిగిన అన్యాయంపై బహిరంగ సభలో క్షమాపణలు చె ప్పాలని జాజుల డిమాండ్ చేశారు. సమావేశంలో పలు బీసీ సంఘాల నేతలు ఎస్ దుర్గయ్య, బాలాగోని బాలరాజుగౌడ్, కులకచర్ల శ్రీనివాస్ ముది రాజ్, విజయ్‌కుమార్‌గౌడ్, కనకాల శ్యామ్‌కుర్మా, అయిలు వెంకన్నగౌడ్, నాగేష్ పాల్గొన్నారు.