- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తాను మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో చేరలేదని, అభివృద్ధి కోసమే చేరారని స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రంలోని తన స్వగృహంలో మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరినీ కలుపుకొని పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన పరిధిలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిఒక్కరి సహకారం కావాలన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందన్నారు. రాష్ట్ర అగ్రో, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు.