యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వేకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఇంటింటి సర్వే కార్యక్రమం ఏర్పాట్లపై మాస్టర్ ట్రైనర్ లు పిపిటి ద్వారా సర్వే ఏవిధంగా చేయాలన్నది అందరికి అవగాహనా కల్పించారు. సంబంధిత కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే నవంబర్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ పరిధిలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లకు ఆదేశించారు.
డిజిటలైజేషన్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సర్వే నిర్వహణ కోసం ఎమ్యూనేటర్లకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను ట్రేనర్స్ ఆఫ్ ట్రేనర్స్ ద్వారా ఏర్పాటు సర్వే పనిని వేగంగా విజయవంతంగా పూర్తి చేయడానికి అత్యుత్తమ ఎమ్యూనేటర్లను ఎంపిక చేయాలని, అవసరమైతే అదనంగా ఎమ్యూనేటర్లు కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సర్వే అన్ని ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని, ఎటువంటి తప్పులు లేకుండా, ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్, జిల్లా ముఖ్య కార్యనిర్వాహక అధికారి శోభరాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, యమ్. పి. డి. ఓ, మున్సిపల్ అధికారులు, ఏ ఎస్ ఓ, యమ్ పి ఎస్, టీచర్స్ పాల్గొన్నారు.