calender_icon.png 15 October, 2024 | 7:55 PM

మెజారిటీ బ్లూ కాలర్ జాబ్స్ వేతనం రూ.20 వేలకే పరిమితం

18-08-2024 12:00:00 AM

ముంబై, ఆగస్టు 17: భారత్‌లో మెజారిటీ బ్లూ కాలర్ ఉద్యోగాలకు నెల వేతనం రూ. 20,000 లేదా అంతకంటే తక్కువగానే ఉంటుందన్నదని, ఈ విభాగంలో అధికశాతం ఉద్యోగులు, కార్మికులు గృహ, ఆరోగ్య, విద్యా అవసరాలు తీరక ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారని బ్లూకాలర్ రిక్రూట్ మెంట్ ప్లాట్‌ఫామ్ వర్క్ ఇండియా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దేశంలోని బ్లూకాలర్ జాబ్స్‌లో రూ.20,000 లేదా అంతకంటే తక్కువ వేతనం పొందుతున్నవారు 57.63 శాతం ఉన్నారని వెల్లడిం చింది. 29.34 శాతంమందికి ఓ మోస్తరుగా నెలకు 20,000 మధ్య జీతం లభిస్తున్నదని, ఈ క్యాటగిరీలో ఉన్నవారికి నిత్యావసరాలు తీరుతున్నప్పటికీ, జీవన ప్రమాణాలు తక్కువేనని నివేదిక పేర్కొంది. బ్లూ కాలర్ ఉద్యోగాల్లో 10.71 శాతంమంది మాత్రమే రూ.40,000 60,000 శ్రేణిలో నెలజీతం పొందుతున్నారని, అదీ ప్రత్యేక నైపుణ్యాలు లేదా అనుభవం కలిగిన వారికే అవకాశం ఉంటుందని, కానీ ఆ పొజిషన్లు తక్కువ ఉంటాయని వర్క్ ఇండియా వివరించింది. కేవలం 2.31 శాతం బ్లూకాలర్ ఉద్యోగులే రూ. 60,000పైన జీతాలు పొందగలుగుతున్నారని పేర్కొంది.