calender_icon.png 12 February, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

11-02-2025 01:38:29 AM

  • కాలిపోయిన బట్టల షాపులు
  • రూ.10 కోట్ల ఆస్తినష్టం

చార్మినార్, ఫిబ్రవరి 10: పాతబస్తీ మదీనా దివాన్‌దేవిడిలో అబ్బాస్ టవర్స్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబ్బాస్ టవర్స్‌లోని మూడో అంతస్తులోని ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్క పక్కనే ఉన్న ఒక్కో షాపునకు వ్యాపించాయి.

మూడో అతస్తు నుంచి రెండో అంతస్తులోని దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దాదాపు గా 30 నుంచి 50 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

దాదాపు 20కి పైగా ఫైరింజన్లు సోమవారం మధ్యాహ్నం వరకు మంటలను ఆర్పివేశాయి. రంజాన్ పండుగ సమీపిస్తుం డటంతో దుకాణాల యాజమనులు భారీగా స్టాకును తెచ్చి షాపుల్లో భద్రపరిచినట్లు తెలుస్తోంది.