శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో 5వ అంతస్తులోని ఓ ఫ్లోర్‌లో మొదలైన మంటలు క్రమంగా బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. బిల్డింగ్‌లో మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు బయటకు పరుగులుపెట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని.. రాయదుర్గం పోలీసులు తెలిపారు.