calender_icon.png 29 April, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

29-04-2025 12:24:09 AM

  1. యూనిట్-1 ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఘటన
  2. బాయిలర్ నుంచి ఆయిల్ లీకేజీ 
  3. మంటలకు దెబ్బతిన్న యూనిట్-1
  4. తృటిలో తప్పించుకున్న కార్మికులు
  5. నిలిచిపోయని 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 
  6. అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

మిర్యాలగూడ, ఏప్రిల్ 28: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులోని యూనిట్-1లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ నుంచి ఆయిల్ లీకేజీ జరిగి మంటలు చెలరేగడంతో యూనిట్-1 పాక్షికంగా దెబ్బతి న్నది.

మే నెలలో యూనిట్-1ను ప్రారంభించనుండగా అందుకుగాను అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో యూనిట్-1 బాయిలర్‌కు ఆయిల్ సరఫరా చేసే పైప్ లీక్ అయ్యింది. అదే సమయంలో కార్మికులు కింద వెల్డింగ్ పనులు చేస్తుండటంతో.. ఆ నిప్పు రవ్వలు ఎగిరి పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఆ మంటలు యూనిట్ మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే ఫైర్ ఇంజన్లను పిలిపించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇతర విభాగాల్లో ఉన్న సిబ్బంది కూడా సహకారం అందించడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై జెన్కో అధికారులు పూర్తిగా ధృవీకరించలేదు. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమేనని అధికార వర్గాలు వెల్ల డించాయి.

జరిగిన ప్రమాదం ద్వారా లోపాలను గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా సరిచేసి తిరిగి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, ప్రమాద సమయంలో కార్మికులు దూరంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

వీలైనంత త్వరగా మరమ్మతు చేయాలి: భట్టి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిన యూనిట్-1ను వీలైనంత త్వరగా మరమ్మతు చేయాలని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రమాదం కారణంగా కొన్ని కేబుల్స్ వాల్వ్‌లకు స్వల్ప నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీజీ జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, బీహెచ్‌ఈఎల్ సీ ఎండీ సదాశివమూర్తి, ఇతర ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 29వ తేదీ వరకు యూనిట్ పనులను పునఃప్రారంభించాలని ఆదేశించారు. ఈ నష్టం ప్లాంట్ సాధారణ కార్యకలాపాలకు ఎలాం టి ఆటంకం కలిగించదని, మరమ్మతు పనులను 7 నుంచి 10 రోజుల్లో సమాంతరంగా చేపట్టవచ్చని బీహెచ్‌ఈఎల్ వివరించింది.