calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచలో భారీ అగ్ని ప్రమాదం

12-04-2025 08:14:01 PM

నిబంధనలకు వ్యతిరేకంగా గ్యాస్ కట్టలతో కటింగ్..

చోద్యం చూస్తున్న అధికారులు.. 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలోని శివనగర్లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాయుడు పాత ఇనుము దుకాణంలో పాత వాహనాలను కొనుగోలు చేసి, గ్యాస్ కట్టర్లతో వాటిని ముక్కలుగా కట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అదే క్రమంలో శనివారం గ్యాస్ కట్టలతో పాత వాహనాలను కట్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఒకేసారి నాలుగువైపుల నుంచి మంటలు ఎగిసి పడటంతో అక్కడ పనిచేసే సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోయారు.

దీంతో షాపు యజమాని కొత్తగూడెం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కొత్తగూడెం నుంచి రెండు ఫైర్ ఇంజన్లు, కెటీపీఎస్ నుంచి ఒక ఫైర్ ఇంజన్ ప్రమాద స్థరానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఏ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పాత ఇనుము దుకాణాలు కొనసాగుతున్నాయి. వారంతా నిబంధనలకు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తుంటారు. ఇంత జరుగుతున్న సివిల్ సప్లై అధికారులు గానీ, రెవెన్యూ పోలీస్ కాలుష్య వాతావరణ శాఖల అధికారులు మామూల మత్తుల తోలుతూ అటువైపు కన్నెత్తి కూడా చూడరని స్థానికుల ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి పాల్వంచ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.