calender_icon.png 7 February, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పిన పెను ప్రమాదం 40 మంది ప్రయాణికులు సురక్షితం

07-02-2025 01:44:56 AM

హుజురాబాద్, ఫిబ్రవరి6: బస్సును లారీ ఢీకొనడంతో  పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జమ్మికుంట రోడ్డులో గురువారం ఆర్టీసీ బస్సును లారీ ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి ఆర్టీసీ  బ స్సును వెనుక  ఢీ కొట్టింది. దీనితో ఆర్టీసీ  బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆర్టీసీ మినీ బస్సు టీఎస్ 23 0002 నంబరు గల బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ కొట్టి ఆగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా వారు ఎ లాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మినీ బస్సు మాత్రం ముందు భాగం నుజు నుజ్జు కావడంతో డ్రైవర్ రవీందర్ పోలీసులను ఆశ్రయిం చారు.

లారీ డ్రైవర్ ఎండి జలీల్ నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీ బస్సు వెనకాల తగిలి బస్సు డివైడర్ కు ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు.  లారీ డ్రైవర్ లారీ యూనియన్ నాయకులను పిలిపించి బస్సు డ్రైవర్ ని బెదిరించేందుకు ప్రయత్నించగా పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.