23-04-2025 12:57:31 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 22: మజీద్‌పూర్ పాఠశాల మిగతా పాఠశాలకు ఆదర్శంగా నిలవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మజీద్‌పూర్ పాఠశాలలో బడి పండుగ కార్యక్రమం స్కూల్ హెచ్‌ఎం. విజయ్ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరై మాట్లాడు తూ.. మజీద్‌పూర్ పాఠశాల మిగతా పాఠశాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఇది ప్రభుత్వ పాఠశాల అంటే ఎవరు నమ్మలేరన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం కూడా అందరికీ ఆదర్శంగా నిలి చేలా ఉండాలన్నారు.
ఇక్కడ ఉన్న నర్సరీని నెల రోజుల్లో తీసివేస్తామని హామీనిచ్చారు. ‘ఇంటికి వంద-బడికి చందా‘ అనే కార్యక్రమం చాలా బాగుందని ప్రశంసించాడు. విద్యార్థులను ప్రయోజకులగా తీర్చిదిద్దుతున్నస్కూల్ హెచ్‌ఎం విజయ్ భాస్కర్ రెడ్డి, టీచర్లకు విద్యార్థుల పక్షాన అం దరిని అభినందనలు తెలిపారు.
నేను తొర్రూర్, హయత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను.. మీరంతా కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని విద్యార్థులకి పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో నక్క శ్రీనివాస్, కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, బింగి దేవదాస్ గౌడ్, సీహెచ్. భాస్కర్ చారి, పోచంపల్లి సుధాకర్ రెడ్డి, కసరమోని లక్ష్మయ్య, కావాడి శ్రీనివాస్ రెడ్డి, మేడిపల్లి వెంకటేష్ గౌడ్, కే రమేష్, చెరుకు శ్రీధర్, కెశెట్టి వెంకటేష్, కొత్త ప్రభాకర్, స్పెషల్ ఆఫీసర్ గుర్రం ఇంద్రసేనారెడ్డి, సెక్రటరీ రాఘవేంద్ర, టీచర్స్, జిలాని, తాళ్ల నాగమణి, టీచర్స్ పాల్గొన్నారు.