22-02-2025 12:00:00 AM
సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబోలో రూపొందిన చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై రాజేశ్ దండా, ఉమేశ్ కేఆర్ బన్సల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోక్ సాంగ్ ‘సొమ్మసిల్లి పోతు న్నావే’ను విడుదల చేశారు. ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా తొలిసారిగా ప్రజాదరణ పొందిన ‘సొమ్మసిల్లి పో తున్నవే’ పాటను రీఇన్వెంట్ చేశారు.
లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్, మోడరన్ బీట్‌లను సాంప్రదాయ జానపద సౌండ్స్ బ్లెండ్ చేసి, ప్రేక్షకులను అలరిస్తోంది. రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఈ పాట సాహిత్యం రస్టిక్ పదాలతో ఆకట్టుకుంది. రేవంత్ హై ఎనర్జీ వోకల్స్ పాటను మరింత ఎక్సయిటింగ్‌గా మార్చాయి. ఈ పాటలో సందీప్ కిష న్, రీతు వర్మ సంప్రదాయ దుస్తులలో అద్భుతంగా కనిపించారు. విజువల్స్ కలర్ ఫుల్‌గా ఉన్నాయి. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.