calender_icon.png 29 September, 2024 | 1:03 PM

మయియా x కసత్‌కినా

22-09-2024 12:00:00 AM

 కొరియా ఓపెన్ ఫైనల్

సియోల్: కొరియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బ్రెజిల్ టెన్నిస్ స్టార్ హద్దాద్ మయీయా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మయియా 6-2, 6-1తో పొలినా కుడెమెటోవా (రష్యా)ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్‌లో  రష్యా స్టార్ కసత్‌కినా 6-3, 6-4తో తన దేశానికే చెందిన నైడర్‌పై సునాయాస విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. అంతకముందు క్వార్టర్ ఫైనల్లో గాయంతో బ్రిటన్ బామ ఎమ్మా రాడుక్కాను వైదొలగడంతో కసత్‌కినాకు సెమీస్‌కు వాకోవర్ లభించింది.