calender_icon.png 15 January, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను ప్రారంభించిన కలెక్టర్

02-12-2024 11:47:17 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సమాన గౌరవం, సమగ్ర వైద్యం లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ల కొరకు ఏర్పాటు చేసిన మైత్రీ ట్రాన్స్ క్లినిక్స్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్చ్యువల్ గా ప్రారంభించారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ముఖ్య అతిధి గా హాజరై  మైత్రి ట్రాన్స్ క్లినిక్ ని  ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు సొసైటీలో వృద్ది చెందాలని, ట్రాన్స్ జెండర్లకి వర్క్ షాప్ పెట్టి వారు ఉద్యోగాలలో స్థిర పడేలా, స్వయం ఉపాధి పథకం ద్వారా స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటాం అని, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తానన్నారు.

జిల్లాలో మొత్తం 126 మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఉన్నారని, వారికీ కొత్తగూడెం ఏరియా హాస్పటల్ నందు ఓపి బ్లాక్ లో రూమ్ నెంబర్ 9 లో ప్రతి గురువారం ట్రాన్స్ జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణులు డా. బాలాజీ- చర్మ వ్యాధి నిపుణులు, డా.ప్రశాంత్- సైకియాట్రిస్ట్, డా.మోహన్ కృష్ణ రెడ్డి - జనరల్ మెడిసిన్  ని నియమించారు. కమ్యూనిటీ ఛాంపియన్స్ గా లాలస, అపూర్వ, కౌన్సిలర్ గా సఖి కౌన్సిలర్ ని నియమించామని తెలిపారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ఆరోగ్య సదుపాయాలను కల్పించడం, అనారోగ్య సమస్యలు, సంక్రమించే వ్యాధులపై సూచనలు అందించడం, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంఘాలకు ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన కల్పించుట, కౌన్సెలింగ్ సేవలు ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఏదైనా సమాచారం, అవసరాల కొరకు 155326 హెల్ప్ లైన్ నెంబర్ నీ వినియోగించుకోవాలి అని తెలిపారు.

ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్లు, ఐ.డి.కార్డ్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, డి.ఏం.హెచ్.ఓ.భాస్కర్, కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధా మోహన్, కౌన్సిలర్ రుక్మాంగాధర్  బండారి, సీడీపీఓ లు విజయ కుమారి, నవ్య శ్రీ, సఖి అడ్మిన్ శుభశ్రీ, మిషన్ శక్తీ కోఆర్డినేటర్ సంతోషి రూప, వైద్యులు, సెక్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్, ట్రాన్స్ జెండర్ నాయకులు ఈశ్వరమ్మ, జానకమ్మ, షాహిన్, నవ్య, లాలస, అపూర్వ, జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.