వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం రేవంత్, సీతక్క
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ఈనెల 2న (సోమవారం) రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లను ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ఈ క్లినిక్‌లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. జిల్లా ఆస్పత్రుల్లో ట్రాన్స్ క్లినిక్‌ల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు.
ట్రాన్స్‌జెండర్లకు ఔట్ పేషెంట్, డయాగ్నస్టిక్ సేవలను వీటి ద్వారా అందించనున్నారు. మహిళా, శిశు సంక్షేమ, వైద్యారోగ్యశాఖల ఆధ్వర్యం లో ట్రాన్స్‌క్లినిక్‌లను అందుబాటులో తీసుకొస్తున్నారు. వివక్షత, చిన్నచూపు కారణంగా జనరల్ ఆస్పత్రుల్లో చికిత్సను పొందలేకపోతున్న ట్రాన్స్‌జెండ ర్ల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. వైద్య సిబ్బందితోపాటు కౌన్సెలర్ల నియామకానికి సైతం ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.