కడ్తాల్ (విజయక్రాంతి): కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ, శివాలయ రామాలయం ఆలయం హుండీ లెక్కింపు బుధవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. 76 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.15,04,074 (పదిహేను లక్షల నాలుగు వేల డెబ్భై నాలుగు రూపాయలు) ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శేఖర్, ఆలయ ట్రస్టీ చైర్మన్ సిరోలి, ఈఓ శ్నేహలత, భాస్కర్, అరుణ్, యాదగిరి, కృష్ణ, చంద్రయ్య, రాములు, శ్రీనివాస్, పత్య, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.