calender_icon.png 1 April, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైసయ్యగౌడ్ సేవలు మరువలేనివి

28-03-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

నల్లగొండ, మార్చి 27 (విజయక్రాంతి) :  పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గుండగోని బీజేపీ రాష్ట్ర నాయకుడు దివంగత మైసయ్యగౌడ్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ చిన్నమెయిల్ అంజిరెడ్డి అన్నారు. మైసయ్య గౌడ్ 27వ వర్ధంతి సందర్బంగా గురువారం నల్లగొండలోని  ఆయన విగ్రహానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కలిసి ఆయన నివాళులర్పించారు.

అనంతరం సంస్మరణ సభలో ఎమ్మెల్సీ మాట్లాడారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానాయకుడు మైసయ్య గౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు బీజేపీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. పార్టీ మైసయ్యగౌడ్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, గుండగోని గిరిబాబు, దోనూరు వీరా రెడ్డి, సాధినేని శ్రీనివాస్, బీజేపీ నల్లగొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, పలువురు కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.