01-04-2025 02:23:53 AM
మేడ్చల్, మార్చి 31 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధి లోని ప్రతాప సింగారం గ్రామం లో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో గుబ్బరి గట్టు మైసమ్మ - ఎల్లమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ మేయర్లు తోటకూర అజయ్ యాదవ్, అమర్ సింగ్, ఘట్కేసర్ మాజీ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుంగతుర్తి రవి, కర్రె రాజేష్, శ్రీకాంత్ యాదవ్, శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.