calender_icon.png 16 November, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్వహణ నిల్.. క్రీడల్

24-09-2024 12:05:31 AM

కాటేదాన్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం

అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభం

నిర్వహణను పూర్తిగా విస్మరించిన స్పోర్ట్స్ అథారిటీ, జీహెచ్‌ఎంసీ

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23: రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి కాటేదాన్‌లో రూ.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం నిరుపయోగంగా పడి ఉంటున్నది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు కొన్నిరోజుల ముం దు 9 అక్టోబర్ 2023న నాటి ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కాంప్లెక్స్‌ను ఆర్భాటంగా ప్రారంభించారు. ఆ తర్వాత పట్టించుకునే నాథుడే కరువయ్యా డు.

‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా కేవలం శిక్షకులను నియమించకపో వడంతో క్రీడాకారులకు నష్టం జరుగుతోం ది. ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ పిచ్, స్మిమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంది. నిత్యం వందలాది మంది క్రీడాకారులు ఇక్కడ సాధన చేసేందుకు అవకాశం ఉన్నది. కనీసం నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో కాంప్లెక్స్ పక్షులకు ఆవాసంగా మారింది. ప్రస్తుతం కాంప్లెక్స్ పక్షుల రెట్టలతో కంపు కొడుతోంది.

ప్రస్తుతం ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది దీని పరిధిలో పెరుగుతున్న మొక్కలకు నీళ్లు పెట్టడంతోనే సరిపోతుంది. శిక్షకుల నియామకం కోసం టెండర్లు పిలిచామని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి చెప్తున్నప్పటికీ.. అది ఎప్పుడు నెరవే రుతుందో తెలియని పరిస్థితి. కాంప్లెక్స్ నిర్వహణపై జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ అధారిటీ డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావును వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

నేను ప్రాజెక్టు ఆఫీసర్‌కు గతంలోనే చెప్పాను.. 

కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం నిర్వహణను అధికారులు పూర్తి గా విస్మరించారు. ఇండోర్ స్టేడియంలోకి పక్షులు రాకుండా జాలీలాంటి ఏర్పాట్లు చేయాలని సూచించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం స్టేడియం నిరుపయోగంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి శిక్షకులను నియమించాలి. క్రీడాకారులు క్రీడలు సాధన చేసేలా అందుబాటులోకి తీసుకురావాలి.

 తోకల శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్