19-03-2025 01:05:03 AM
జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ మార్చి 18 (విజయ క్రాంతి) : శాంతి భద్రతల పరిరక్షణ అతి ముఖ్యమైన అంశమని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి. జానకి పర్యవేక్షించారు. పౌరుల భద్రత, శాంతి, సమాజంలో నేరాలను నివారించే చర్యలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీస్ సిబ్బంది అధిక కృషి చేయాలని ఆమె ఆదేశించారు.విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా మున్ముందు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు.