calender_icon.png 9 January, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మైనంపల్లి హన్మంత్ రావు జన్మదిన వేడుకలు

08-01-2025 07:28:56 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు జన్మదిన వేడుకలను మాజీ సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నుండి ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటనలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కావేరి వెంకట్ రెడ్డిలు హైదరాబాద్ నుండి భారీ కాన్వయిలో రావడంతో ముందుగా చిటుకుల మహిపాల్ రెడ్డి మైనంపల్లికి పుష్ప గుచం అందజేసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

క్రెన్ సహాయంతో ఏర్పాటు చేసిన భారీ గజమాను వేసి జేసిబి యంత్రంతో పూల వర్షం కురిపించారు. మైనంపల్లి పేరు మీదుగా ప్రతేక పాటలను రచయించి బహుమతిగా అందజేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులతో కలిసి మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్లకల్ గ్రామ చివరి నుండి మనోహరబాద్ వరకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ చేపట్టారు. మార్గమధ్యలోని కాళ్లకల్ బంగారమ్మ ఆలయంలో ప్రతేక పూజలు చేశారు. మనోహరబాద్ సభ ప్రాంగణంలో ప్రతేకంగా తయ్యారు చేసిన భారీ కేక్ ను హన్మంత్ రావు కట్ చేసి నాయకులతో సంబరాలు చేసుకున్నారు.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మైనంపల్లి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని లాంగ్ లివ్ హన్మంత్ అన్న అంటూ నినాదాలు చేశారు. అనంతరం మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమన్ని అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మాడి మండల సోసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్, ఉపసర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు మన్నే ధర్మేందర్ ముదిరాజ్, మైనారిటీ మండల అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్ జావీద్ పాషా, జిల్లా కాంగ్రెస్ నాయకులు నరేన్ రెడ్డి, శ్రీహరి గౌడ్, నూకల రాము యాదవ్, నాగభూషణం, శంకర్, రఘు గుజ్జి, ఆటో యూనియన్ అధ్యక్షులు ఎండి గులామ్, ఇర్ఫాన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.