calender_icon.png 19 March, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని పట్టణంలో ప్రధాన రహదారి కబ్జా..

18-03-2025 07:58:13 PM

ప్రధాన రహదారిపై పండ్ల దుకాణాలు.. పట్టించుకోని అధికారులు..

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

మంథని (విజయక్రాంతి): నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే మంథని పట్టణంలో ఏకంగా ప్రధాన రహదారిని కొందరు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ప్రధాన రహదారిపై పండ్ల బండ్లు పెట్టి ప్రధాన రహదారిపై అమ్ముతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రయాణికులు, పట్టణ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిత్యం గోదావరిఖనికి, భూపాలపల్లికి వరంగల్ వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు లారీలు, కార్లు ద్విచక్ర వాహనాలు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.

ఇంత రద్దీగా ఉండే మంథని పట్టణంలో ప్రధాన రహదారిపైనే పండ్ల దుకాణాలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదవశాత్తు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రయాణికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు కళ్ళు తెరిచి ప్రధాన రహదారిపైన ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాలను ఇతర దుకాణాలను తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.