calender_icon.png 10 March, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల భద్రత, రక్షనే ప్రధాన లక్ష్యం: కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర

10-03-2025 10:39:45 AM

 సింధు శర్మ నుంచి బాధ్యత లు స్వీకరించిన ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల భద్రత రక్షణ నే ముఖ్యమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం ఉదయం బదిలీపై వెళ్లిన ఎస్పీ సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణ నే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ని  మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.