- జాతీయ మహిళా కమిషన్ చీఫ్‌ను ట్రోల్ చేసిన తృణమూల్ ఎంపీ
- గట్టిగా సమాధానం ఇచ్చిన రేఖా శర్మ
న్యూఢిల్లీ, జూలై 5: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరో వివాదం లో చిక్కుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ మీద ఆమె చేసిన ఆరోపణలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలకు రేఖా శర్మ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యల మీద జాతీయ మహి ళా కమిషన్ సీరియస్ అయింది. ఆమె వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. మహువా మీద ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయింది.
అసలేం జరిగిందంటే..
జూలై 4వ తేదీన రేఖా శర్మ హత్రాస్ తొక్కిసలాటలో గాయపడిన మహిళలను కలి సేందుకు వెళ్లారు. ఆమె అక్కడ మహిళలను పరామర్శించిన వీడియో సోషల్ మీడియా లో ప్రత్యక్షం అయింది. అక్కడికి ఆమె వెళ్లినపుడు ఆమె వెంట ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. ఇది చూసిన ఓ యూజర్ రేఖా శర్మకు గొడుగు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆమె తన గొడుగును కూడా పట్టుకోలేకపోతుందా అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు మహువా స్పందిస్తూ.. రేఖా శర్మ తన బాస్ పైజామాను పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది. కాబట్టి వేరే వ్యక్తి ఆమెకు గొడుగు పట్టాడు అని కామెంట్ చేసింది.
ఎంపీకి అది నచ్చట్లేదేమో: రేఖా శర్మ
మహువా కామెంట్‌పై రేఖా శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. మహువాకు ఎంపీగా చేయ డం పెద్దగా నచ్చడం లేదేమో. అందుకే ఇలా ట్రోల్స్ చేస్తున్నారని.. ట్రోలర్ల కోసం నా స మయం వృథా చేసుకోను అని రిప్లు ఇచ్చారు.
మహువాను బర్తరఫ్ చేయాల్సిందే: బీజేపీ
అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మహువా మొయిత్రాను తృణమూల్ వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్
చేస్తున్నారు.