calender_icon.png 12 February, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి

12-02-2025 12:01:48 AM

వికారాబాద్ ఫిబ్రవరి 11:  బీఆర్‌ఎస్ పార్టీ వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అశోక్ ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వికారా బాద్ మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా అశోక్ ను నీయ మించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభు త్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని దాన్ని సానుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యా మౌలిక వసతుల కల్పన మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద పటేల్ పాల్గొన్నారు.