ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు2024 నవంబర్‌లో 12 శాతం పెరిగి 79,083 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఈ విక్రయాలు 70, 576 యూనిట్లగా ఉన్నాయి. ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో కంపెనీ దేశీయ మార్కెట్లో 46,222 వాహనాలను విక్రయించింది. గతేడాది విక్రయిం చిన 39,981 వాహనాలతో పోలిస్తే, ఈ ఏడాది నవంబర్లో 16శాతం వృద్ధిని సాధించిందని మహీంద్రా అండ్‌మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది.
మొత్తం మీద, కంపెనీ గత నెలలో ఎగుమతులు సహా 47,294ఎస్‌యూవీ లను విక్రయించింది. గత నెలలో మొత్తం ట్రాక్టర్ విక్రయాలు(ఎగుమతులతో కలిపి) 33,378 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది నవంబర్‌లో మొత్తం ట్రాక్టర్ అమ్మకాలు (ఎగుమతులతో కలిపి) 32,074గా ఉన్నాయి.