calender_icon.png 4 March, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పాయంను మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు

03-03-2025 06:49:33 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల మరోసారి ఎన్నికైన బర్ల నాగమణితో పాటు అన్ని మండలాల మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు సోమవారం మణుగూరులోని ప్రజాభవన్ లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ బోడ దివ్య, బూర్గంపాడు మండల మహిళ అధ్యక్షులు భూక్య సుగుణ, మణుగూరు మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.