calender_icon.png 24 February, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతను చాటుకున్న మహేశ్వరం పోలీసులు..

23-02-2025 11:01:02 PM

మహేశ్వరం (విజయక్రాంతి): మహేశ్వరం పోలీసులు మరోసారి తమ బాధ్యతను చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో పరీక్ష రాయాల్సిన రిక్షిక అనే విద్యార్థిని పొరపాటును ఆమె తల్లితో కలిసి మహేశ్వరం గురుకుల పాఠశాలకు చేరుకుంది. పరీక్ష రాయాల్సింది ఎన్‌ఆర్‌ఐ కళాశాల అని తెలుసుకొని ఆందోళన చెందారు. పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. పరీక్షకేంద్రానికి ఎలా వెళ్లాలి తెలియడం లేదని బాధపడుతుండగా విషయం మహేశ్వరం పోలీసులకు తెలిసింది. కానిస్టేబుల్ వెంకటేష్, డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేందర్ వెంటనే స్పందించారు. విద్యార్థిని పోలీస్ వాహనంలో ఎక్కించుకొని సమయానికి పరీక్షకేంద్రానికి చేర్చగలిగారు. దీంతో విద్యార్థిని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.