calender_icon.png 16 January, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి వేడుకల్లో మహేశ్వర్ రెడ్డి

15-01-2025 11:30:23 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సంకాంత్రి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు వానకాలంలో పండించిన పంటలు చేతికి వచ్చిన తరువాత మొట్టమొదటి పండుగా సంక్రాంతి పండుగా కావడంతో ప్రజలు, రైతులు ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు ప్రతి ఇంటిని ముగ్గులతో అలంకరించారు. ఇంట్లో పిండి వంటలు చేసుకోని నోములు ఇచ్చారు. చదువుల కోసం ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు పండుగకు సొంత ఊళ్ళకు రావడంతో చిన్ననాటి మిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి కాలం గడిపారు. పిల్లలు గ్రామల్లో పతంగులు ఎగురవేయగా చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు పొంగళ్ళను నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో ఎమ్మెల్యే బీజేఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డి డిసిసి అధ్యక్షలు శ్రీహారి రావు వారి అనుచరులతో కలిసి పతంగులు ఎగురు వేశారు.